calender_icon.png 25 November, 2024 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

25-11-2024 02:39:33 AM

పెద్దల జాతరలో

  1. సీనియర్ సిటిజన్స్ జోష్
  2. ఆట, పాటలతో అలరించిన వయోవృద్ధులు   

వీటీవీవో ఆధ్వర్యంలో మొదటిసారి నిర్వహణహైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): నగరంలోని వివిధ వృద్ధాశ్రమాల్లో ఉన్న వృద్ధులు ఒకచోట చేరి ఆదివారం ఆట, పాటలతో ఉల్లాసంగా గడిపారు. మహిళలకు గోరింటాకు పెడుతూ వలంటీర్లు సందడి చేశారు. ఆదివారం నగర శివారు దుండిగల్ మున్సిపాలిటీ, బౌరంపేటలోని శిఖర స్కూల్ ఆవరణలో వీటీవీవో సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఆనంద బాష్పాలతో వాలంటీర్లతో తమ నేపథ్యాన్ని పంచుకున్నారు.

తమవారికి దూరంగా వృద్ధాశ్రమాల్లో ఉంటున్న మా ముఖాల్లో ఈ కార్యక్రమం చిరునవ్వులు పూయించిందని పలువురు వృద్ధులు పేర్కొన్నారు. ప్రోగ్రామ్‌లో నగరంలోని 20 వృద్ధాశ్రమాలకు చెందిన 400 మంది సీనియర్ సిటీజన్లు తదితరులు పాల్గొన్నారు. 

పిల్లలతో మొదలై

2012 నుంచి బెంగుళూరుకు చెందిన వీటీవీవో సంస్థ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సురేంద్రన్ ఎం కృష్ణన్ ఈ సంస్థను స్థాపించారు. పిల్లలు, జంతురక్షణతో మొదలైన వారి సేవ కార్యక్రమాలను వివిధ రంగాలకు విస్తరించారు. 2017 నుంచి ఓల్డేజ్ ఫెస్ట్‌వల్ (పెద్దల జాతర) నిర్వహిస్తున్నారు. గతంలో బెంగుళూరులో ఐదుసార్లు, చెన్నైలో ఒకసారి నిర్వహించారు. తాజాగా ఆదివారం తెలంగాణలో మొదటిసారిగా పెద్దల జాతరను నిర్వహించడం విశేషం.

ఈ జాతరకు వృద్ధాశ్రమాల నుంచి సీనియర్ సిటిజన్లను తీసుకొచ్చి వారికి ఆటలు, పాటలు, డ్యాన్సులు, ఇతర పోటీలు నిర్వహించారు. గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. 

చాలా సంతోషంగా ఉంది 

మాది నాగోల్.. నాకు ముగ్గురు పిల్లలు. కొంతకాలం కింద నా కొడుకు చనిపోయాడు. మూడు నెలలుగా వృద్ధాశ్రమంలో ఉంటున్నా. కొన్నిసార్లు ఒంటరితనంలో బాధగా ఉంటుంది. వృద్ధాశ్రమం నుంచి మొదటిసారి పెద్దల జాతర లాంటి కార్యక్రమానికి వచ్చా. చాలా సంతోషంగా ఉంది. ఆటలు ఆడించారు. బహుమతులు కూడా ఇచ్చారు.

మణెమ్మ, నాగోల్

వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు చిందించాలని

వీటీవీవో ఆధ్వర్యంలో మొదట పేద పిల్లలు, మూగ జీవాల కోసం కార్యక్రమాలు నిర్వహించాం. ప్రస్తుతం మా బృందంలో 5 వేల మంది పని చేస్తున్నారు. వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు చిందించాలని పెద్దల జాతర నిర్వహించాం. మా టీమ్‌లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వారంతంలో ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతారు. 

సురేంద్రన్, వీటీవీవో వ్యవస్థాపకుడు
వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు చిందించాలని

వీటీవీవో ఆధ్వర్యంలో మొదట పేద పిల్లలు, మూగ జీవాల కోసం కార్యక్రమాలు నిర్వహించాం. ప్రస్తుతం మా బృందంలో 5 వేల మంది పని చేస్తున్నారు. వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు చిందించాలని పెద్దల జాతర నిర్వహించాం.
మా టీమ్‌లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వారంతంలో ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతారు.
సురేంద్రన్, వీటీవీవో వ్యవస్థాపకుడు