స్వీట్ల తయారీలో కలర్స్ వాడుతున్నట్లు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): నగరంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎమరాల్డ్ స్వీట్ హౌస్‌లో జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. స్వీట్ల తయారీలో ప్రమాదకరమైన కలర్స్‌ను కలుపుతున్నట్టు తనిఖీల్లో గుర్తించారు. సరైన పద్ధతిలో నిల్వ చేయని మూడు కిలోల జీడి పప్పును సీజ్ చేశారు. నేతి మిఠాయి తయారు చేసే వంట గది అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించారు. ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండానే ఫుడ్ సరఫరా చేస్తున్నారని, సరైన లేబులింగ్ లేని ముడి సరుకుతో మిఠాయిల తయారు చేస్తున్నట్టుగా అధికారులు కనుగొన్నారు. అధికారులు పలు శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినట్టుగా తెలిపారు. నిర్వాహకులు మాత్రం అంతా సక్రమంగానే ఉన్నట్లు తెలిపారు.