calender_icon.png 17 November, 2024 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్‌డ్యాం అంచనాలు పెంచుతూ ఉత్తర్వులు

17-11-2024 12:42:32 AM

  1. గతంలో రూ.4.71 కోట్లు.. ఇప్పుడు రూ.6.85కోట్లు
  2. ఖమ్మంలోని సిరిపురంలో నిర్మించనున్న చెక్‌డ్యాం

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాం తి): ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపు రం గ్రామ పరిధిలో వైరా నదిపై చెక్‌డ్యాం నిర్మించేందుకు నీటిపారుదల శాఖ (మైనర్ ఇరిగేషన్)కు రూ.6.85 కోట్లు పరిపాల నా అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

గత ఫిబ్రవరిలో నీటిపారుదల శాఖ ఇదే చెక్‌డ్యాం నిర్మాణానికి సంబంధించి రూ.4.71కోట్లకు పరిపాల నా అనుమతి రాగా.. చీఫ్ ఇంజినీర్ నుంచి రివైజ్డ్ అంచనాల ప్రతిపాదనలు వచ్చాయి. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) ఇచ్చిన డ్రాయింగ్‌లను పరిగణలోకి తీసుకుని రివైజ్డ్ అంచనాల ప్రతిపాదనలు పంపిస్తున్నట్టు సీఈ అందులో వివరించారు.

దీనిని పరిశీలించిన ప్రభుత్వం (నీటిపారుదల శాఖ) రూ. 6.85కోట్లకు పరిపాలనా అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా అంచనాల్లో పేర్కొన్న గణాంకాలు, పరిమాణాలు, అంశాలకు సంబంధించి సదరు సీఈ నే బాధ్యుడని అందులో స్పష్టంగా పేర్కొన్న ది. హైడ్రాలాజికల్ అనుమతులు, ఫీజిబిలిటీ రిపోర్టులను సీఈ తీసుకోవాలని, చుట్టుపక్కల చెక్‌డ్యాంలు ఉంటే వాటి నీటి పరీవా హక పరిధిలోకి రాకుండా చూసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నది.