calender_icon.png 8 January, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రణవ్‌కు చెక్

10-11-2024 12:00:00 AM

చెన్నై: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో వరుసగా నాలుగు విజయాలతో దూకుడు మీదున్న గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్‌కి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం జరిగిన ఐదో రౌండ్‌లో ప్రణవ్‌కు రౌనక్ సద్వానీ 39 ఎత్తుల్లో చెక్ పెట్టాడు. ఇక అమితన్ తబటబెయితో జరిగిన మ్యాచ్‌లో విదిత్ గుజరాతీ 57 ఎత్తుల వద్ద డ్రా చేసుకోగా.. చాలెంజర్స్ కేటగిరీలో హారిక, వైశాలీ మధ్య జరిగిన పోరు డ్రాగా ముగిసింది. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్నాడు.