23-03-2025 12:00:00 AM
శరీరానికి చెమట పట్టడం మంచిదే. మన ఒంట్లోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి, శరీరంలో అధిక ఉండే వేడి తగ్గించడానికి చెమట పట్టాలి. కాని, కొన్నిసార్లు శరీరానికి అధికంగా చెమటపడుతుంది. దాంతో దుర్వాసన వస్తుంది. చంకలు, పాదాలు, అరచేతుల్లో ఎక్కువగా చెమట పట్టడం వల్ల ప్రతి అసౌకర్యంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే..
ఏవైనా పనులు చేస్తే చెమట మరింత ఎక్కువ అవుతుంది. దీనికి చెక్ పెట్టాలంటే సమ్మర్లో కనీసం రోజుకు రెండుసార్లు చల్లని నీటితో స్నానం చేయాలి. ఉదయం, సాయంత్రం స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో చెమట ఎక్కువగా పట్టదు.
వేసవిలో తీవ్రమైన వేడి తాపం నుంచి ఉపశమనం కోసం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. మంచినీటితో పాటు మజ్జిగ తరచుగా తాగాలి. దాంతో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో చెమట ఎక్కువగా రాదు. నీళ్లు ఎక్కువగా తాగాలి.
చెమట తీవ్రతను తగ్గించుకోవాలంటే గాలి బాగా ప్రసరించే కాటన్ దుస్తులు ధరించాలి. శరీర ఉష్ణోగ్రత పెరగకుండా చల్లదనాన్ని ఇస్తాయి.
శరీరాన్ని పొడిగా ఉంచుకోవాలంటే సమ్మర్‌లో పౌడర్ వాడాలి. ఇది చెమటను తగ్గిస్తుంది. అండర్ ఆర్మ్ ప్రదేశాల్లో పట్టే చెమటను పౌడర్ గ్రహిస్తుంది. ఇది మంచి సువాసన అందించి చర్మానికి చల్లదనాన్ని, మృదుత్వాన్ని ఇస్తుంది.