యోగా శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. యోగా శరీరాన్ని ఫిట్‌గా కూడా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా యోగాసనాలలో గోముఖాసనం చేయడం వల్ల శరీరం పూర్తిగా సాగుతుంది. అలాగే అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మహిళల్లో పీసీఓడీ సమస్యను తగ్గిస్తుంది. గోముఖాసనం వేయడం వల్ల కలిగే ప్రయోజనా లేంటో తెలుసుకుందాం..
గోముఖాసనం చేసే విధానం
గోముఖాసనం చేసేముందు ఖాళీ కడుపుతో ఉండాలి. మొదట యోగా మ్యాట్‌పై కూర్చోని ఎడమ కాలును తుంటి కిందకు తీసుకుని, ఆపై కుడి కాలును మరో కాలు మీదుగా క్రాస్ చేసి తుంటి దగ్గరికి తీసుకెళ్లండి. మీ కుడి చేతులను పైకి నిటారుగా ఉంచండి. తర్వాత మీ ఎడమ చేతిని నడుము దగ్గర తిప్పి వెనక్కి తిప్పిపై నుంచి వస్తున్న చేతిని పట్టుకోండి. ఇప్పుడు గట్టిగా శ్వాస తీసుకోవాలి. ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.
ప్రయోజనాలు
* లివర్, కిడ్నీల పనితీరును మెరుగుపరచడానికి గోముఖాసనం సహాయపడుతుంది.
* ప్రతిరోజూ గోముఖాసనం చేయడం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆసనం చేసే సమయంలో ఛాతీ విస్తరించి.. కుంచించుకుపోయిన ఊపిరితిత్తులు తెరుచుకుంటాయి. తద్వారా శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అలాగే వెన్నెముక నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
* ఆఫీసులలో నిరంతరాయంగా కూర్చొని పని చేయడం వల్ల భుజాలలో నొప్పి, మెడ నొప్పులు కలుగుతాయి. వీటి నుంచి ఉపశమనం పొందడానికి గోముఖాసనం ఉపయోగపడుతుంది.
* బ్యాక్ వంగి పోయిన వారికి గోముఖాసనం భంగిమను సరిచేయడంలో సహాయపడుతుంది. నడుము, తుంటి నొప్పిని తగ్గిస్తుంది.
- అనిక అత్యాల,
అనిత యోగ అకాడమీ
6309800109
* ముఖ్యంగా అమ్మాయిలను ప్రతినెల వేధించే పీసీఓడి సమస్యను దూరం చేయడంలో గోముఖాసనం బాగా పనిచేస్తుంది.