22-02-2025 12:00:00 AM
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ బీట్ పేరుతో వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. అగ్ర వర్ణాల అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, వారికి ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతోందనే అంశాల్ని ఈ సినిమా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
టెక్నాలజీ పరంగా ఎన్నో మలుపులు తీసుకుని ముందుకెళుతున్న నేటి సమాజంలో ఇప్పటికీ ఇలాంటి దురా గతాలు జరుగుతున్నాయా? అనేది ఈ గ్లింప్స్‌ను గమనిస్తుంటే ఒకింత ఆశ్చర్యం వేయక మానదు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పురాతన ఆచారా లు, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సిని మాను ఆవిష్కరిస్తున్నారు. విలక్షణ నటుడు శివాజీతో పాటు నవదీప్, నందు, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.