calender_icon.png 19 April, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింఛన్ల అక్రమాలకు చెక్!

19-04-2025 12:55:50 AM

  1. ముఖ గుర్తింపుకు ప్రభుత్వం కసరత్తు
  2. త్వరలో అమలుకు యోచన
  3. తొలగనున్న లబ్ధ్దిదారుల ఇక్కట్లు

సంగారెడ్డి, ఏప్రిల్ 18(విజయక్రాంతి):అభాగ్యులకు, వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం చే యూత పథకం కింద అందిస్తున్న పింఛన్ల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సి ద్దమవుతోంది. లబ్దిదారుల ఇబ్బందులు దూరం చేయడంతో పాటు పంపిణీలో పారదర్శకత తీసుకురావాలని సెర్ఫ్ నిర్ణయించిం ది. ఇందుకోసం ముఖ గుర్తింపు యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభు త్వం కసరత్తు చేస్తోంది. 

అక్రమాలకు అడ్డుకట్ట...

మున్సిపాలిటీల్లో పించన్ సొమ్మును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఇలాంటి వారు బతికి ఉన్నారో లేదో అన్న సమాచారం అధికారులకు తెలియడం లేదు. ఎవరైనా పింఛన్ దారు మరణిస్తే  కు టుంబ సభ్యులు సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లయితే సదరు లబ్దిదారునికి అందించే పింఛన్ నిలిచిపోతుంది.

కానీ అలా జరగడం లేదు. పింఛన్దారు మరణించినా డబ్బులు మాత్రం డబ్బులు మాత్రం వారి ఖాతాలో జమ అవుతున్నాయి. వాటిని కొంతమంది ఏటీఎంల ద్వారా డ్రా చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు పలుచోట్ల వెలుగులోకి వచ్చాయి. కాఆ పింఛన్దారుల్లో ఎక్కువ మంది వృద్ధులు, దివ్యాంగులే ఉంటారు. వీరి చేతి వేళ్ళ కొనలు అరిగిపోయి వేలిముద్రలు పడకపోవడంతో పంపిణీలో సమస్యలు తలెత్తుతు న్నాయి. 

పంచాయతీ కార్యదర్శులు తమ వేలిముద్రల ఆధారంగా పింఛన్ అందజేస్తున్న ప్పటికీ పదేపదే తిరగాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఇలావుండగా పలు చోట్ల కొంతమంది పంచాయతీ కార్యదర్శు లు సైతం మరణించిన వారి పింఛన్లు కాజేసిన సంఘటనలు ఉన్నాయి.

ఇలాంటి అక్ర మాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఇందుకు గాను ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను తీసుకొచ్చేలా కసరత్తు చేస్తోంది. తద్వారా పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు వేలిముద్రలు పడనటువంటి వారి ఇబ్బందులు దూరం కానున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

అయితే పింఛన్ల పంపిణీలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభు త్వం ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తెచ్చేందుకు కసరత్తు చేస్తోందని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతుందని, ఇప్పటి వరకైతే ఎలాంటి ఆదేశాలు రాలేదని, త్వరలోనే ఈ విధానం అమలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.