calender_icon.png 17 November, 2024 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్‌గాంధీ బ్యాగుల్లో తనిఖీ

17-11-2024 01:43:34 AM

ముంబై, నవంబర్ 16: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతల బ్యాగులు, హెలికాఫ్టర్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బ్యాగులను ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. అమరావతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హెలికాఫ్టర్‌లో వచ్చిన రాహుల్ గాంధీ బ్యాగులను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. అధికారులు బ్యాగులు తనిఖీ చేస్తుండగానే రాహుల్ తన పార్టీ నేతలతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాహుల్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌కు అనుమతులు ఇవ్వకపోవడంతో దాదాపు 45 నిమిషాల పాటు ఆయన హెలికాఫ్టర్‌లోనే ఉండిపోయారు. దీనిపై రగడ జరుగుతున్న క్రమంలోనే అధికారులు తనిఖీ చేయడంతో కాంగ్రె స్, దాని మిత్ర పక్షాల నేతలు.. ఈసీ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈసీ కేవలం విపక్ష పార్టీల నేతల బ్యాగులు, హెలికాఫ్టర్లు మాత్రమే తనిఖీ చేస్తోంది, మోదీ, అమిత్ షా సహా కేంద్ర మంత్రుల బ్యాగులనూ ఇలాగే తనిఖీ చేయాలని వారు డిమాం డ్ చేస్తున్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 20న పోలింగ్ జరగనుంది. ౨౩న ఫలితాలు.