జగిత్యాల, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జిల్లా కేంద్రమైన జగిత్యాల గణేష్ భవన్ ఉడిపి హోటల్‌ను జి ల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష సో మవారం తనిఖీ చేశారు. మళ్లీ య థావిధిగా సీజ్ చేశారు. ఆదివారం ఉదయం ఓ మహిళా కస్టమర్ ఇడ్లీ లో జెర్రీ కనిపించగా ఆమె ఉడిపి హోటల్ యజమానిపై కఠిన చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తనిఖీలు నిరహించి సీజ్ చేశారు.