జీహెచ్‌ఎంసీ కమిషనర్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): గ్రేటర్ నగర నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చెక్ పెట్టేందుకు బల్దియా కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వరం సివిల్ ఇంజినీరింగ్ విభాగంతో త్వరలోనే జీహెచ్‌ఎంసీ ఒప్పందం కుదుర్చుకోనుంది.
ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్‌ఐ వరంగల్ ప్రొఫెసర్ ప్రసాద్‌తో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆదివారం సమావేశమయ్యారు. ఇలంబర్తి మాట్లాడుతూ.. ఎన్‌ఐటీ వరంగల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత నగరంలో ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన, రవాణా ప్రణాళిక తదితర సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు సీఈ దేవానంద్, మెయింట్‌నెన్స్ సీఈ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.