- ఇంజెక్షన్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు
విజయవంతంగా ట్రయల్స్ పూర్తి
న్యూఢిల్లీ, జూలై 7 : చికిత్స తప్ప నివారణ లేని హెచ్‌ఐవీ వ్యాధి నయమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా, ఉగాండాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ మెడిసిన్‌కి సంబంధించిన ట్రయల్స్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మెడిసిన్ హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను 100 శాతం ప్రభావవంతంగా ఎదుర్కొంటున్నట్లు శాస్త్రవేత్తలు నిర్థారించారు.
ఆర్నెళ్లకోసారి ఈ ఇంజెక్షన్ వేసుకుంటే ఇన్‌ఫెక్షన్ బారి నుంచి బాధితులు ఉపశమనం పొందవచ్చని గుర్తించారు. లెనాకాపవిర్ అనే ఇంజెక్షన్ హెచ్‌ఐవీ సంక్రమణ తగ్గించేందుకు వాడే రెండు ఇతర ఇంజెక్షన్ల కంటే మెరుగ్గా పనిచేస్తుందని అధ్యయనంలో కనుగొన్నారు. ఇంజెక్షన్ తీసుకున్న మహిళ హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ పొందినట్లు తేలింది.
త్వరలోనే మార్కెట్‌లోకి మెడిసిన్..
ఉగాండాలోని 3, దక్షిణాఫ్రికాలోని 25 ప్రాంతాల్లో నిర్వహించిన ట్రయల్స్‌లో లెనాకాపవిర్, ఇతర రెండు ఔషధాల సామర్థ్యా న్ని పరీక్షించారు. డబ్ల్యూహెచ్‌ఓ అనుమతిస్తే ఈ మెడిసిన్ త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కానుంది.