calender_icon.png 16 January, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో అక్రమ కట్టడాలకు చెక్

02-09-2024 01:47:19 AM

నిర్మాణాలను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు

అందోళన చెందుతున్న అక్రమార్కులు

మంథని, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): మంథని పట్టణంలో అక్రమ కట్టడాలకు అధికారులు చెక్ పెడుతున్నారు.  గతంలో రాజయకీయ నాయకుల అండదండల ంతో అక్రమార్కులు నిర్మించిన కట్టడాలు నేలమట్టం కానున్నాయి. దీ ంతో పట్టణ ప్రజలు ఆనందం వ్య క్తం చేస్తున్నారు. మంథని పట్టణం లో ప్రధాన రహదారికి ఇరువైపుల అక్రమంగా దుకాణాలను నిర్మించుకొని ప్రయాణికులకు తీవ్ర ఇబ్బ ందులు పెడుతున్నారని మున్సిపల్ అధికారులకు  ఫిర్యాదులు అందా యి.

శ్రీపాద చౌక్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రధాన రహదారి పైకి దుకాణాలు వెలిశాయి.  ము న్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి ఆదివారం సిబ్బందితో వెళ్లి అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. అక్రమ కట్టడాలను తొలగించి ప్రయణికులకు ఇబ్బందులు లేకుండ చేస్తామని కమిషనర్ తెలిపారు. మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేస్తే విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటుమా ని కమిషనర్ హెచ్చరించారు. కొం దరికి చెందిన అక్రమ కట్టడాలనే కూలుస్తారా లేక మరికొందరి అక్ర మ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా అని ప్రజలు చర్చించు కుంటున్నారు.