18-03-2025 12:00:00 AM
జనగామ, మార్చి 17(విజయక్రాం తి): లాప్రోస్కోపిక్ అండ్ ఇన్‌ఫెర్టిలిటీ సిస్టమ్‌తో సంతాన సమస్యలను సులువుగా పరిష్కరించవచ్చని డాక్టర్ కాత్య తెలిపారు. తమ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్‌లో ఈ సిస్టమ్‌లో అందు బాటులోకి తీసుకొచ్చామన్నారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ..
సంతాన లేమితో బాధపడుతున్న వారి జనగామలోని లోటస్ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలు ప్రారంభించామని, కానీ ఇందులో ఇంతకుముందు నూతన టెక్నాలజీ అందుబాటులోకి రాలేదన్నారు. ప్రస్తుతం లాప్రోస్కోపిక్ అండ్ ఇన్ ఫెర్టిలిటీ సెంటర్‌ను అందుబాటోకి తెచ్చామని, సంతానం కలగని దంపతులకు ఇది ఎంతగానో దోహదపడు తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లింగమూర్తి, రజని తదితరులు పాల్గొన్నారు.