calender_icon.png 16 January, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీఎల్‌తో విద్యుత్ సమస్యలకు చెక్

15-07-2024 12:10:00 AM

ప్రతీ పోల్‌కు ప్రత్యేక నంబర్ కేటాయింపు

టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ తెలంగాణ లిమిటెడ్ తన పరిధిలో వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు అంతరాయాల ను కనిష్ట స్థాయిలోకి తీసుకురావడానికి కొత్త సాంకేతిక పద్ధతులకు శ్రీకారం చుట్టిం ది. ఇందులో భాగంగా టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో అసెట్ మ్యాపింగ్ ట్రాకింగ్‌లో అన్ని 33కేవీ, 11కేవీ స్తంభాలకు యూనిక్ పోల్ నంబర్(యూపీఎల్) పెయింటింగ్ ప్రక్రియను ప్రారంభించామని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. టీజీఎన్పీడీసీఎల్‌లోఅసెట్ మ్యాపింగ్ వలన పోల్‌లవారీగా పెట్రోలింగ్ సులభంగా చేపట్టవచ్చు అని, నిర్వహణను కూడా ట్రాక్ చేసే వీలుంటుందని శనివారం ఆయన మీడియా ద్వారా వెల్లడించారు.

గత తాలుకు అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలు కూడా ట్రాక్ చేసుకునే సౌకర్యం ఉందన్నారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే వెం టనే ఆ పోల్ నంబర్ ఆధారంగా అక్కడి లొ కేషన్ మ్యాపింగ్ తెలుసుకొని త్వరితగతిన స మస్య పరిష్కరించవచ్చని, దీంతో  అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గిం చవ చ్చన్నారు. అంతేకాకుండా ముంద స్తు సమాచారం తెలుసుకునేందుకు, సమస్యలు ఏర్ప డకముందే గుర్తించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటివరకు సుమారు 1826 ఫీడర్లకు నంబరింగ్,  డిజిటలైజేషన్, పీఎంఐ (ప్రీ మాన్సూన్ ఇన్స్పె క్షన్)  పూర్తి చేశామని.. మిగతా ఫీడర్లు రాబో యే రెండు నెలల్లో పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వరుణ్‌రెడ్డి తెలిపారు.