calender_icon.png 19 April, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడ్యుకేషన్ హబ్ లో తాగునీటి సమస్యకు చెక్

18-04-2025 08:51:44 PM

గజ్వేల్: గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ లో గత కొన్ని నెలలుగా నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. గత రెండేళ్లుగా ఎడ్యుకేషన్ హబ్ లో విద్య నభ్యసిస్తున్న విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విద్యార్థులు, ఎడ్యుకేషన్ హబ్ యాజమాన్యం తాము ఎదుర్కొంటున్న నీటి సమస్యను మూడు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన శుక్రవారం బాలికల ఎడ్యుకేషన్ హబ్ ప్రాంతంలో రెండు బోర్లు వేయించారు. బోర్ల నుండి పుష్కలంగా నీరు రావడంతో విద్యార్థులు, ఎడ్యుకేషన్ హబ్ లోని కళాశాలలో హాస్టల్లో పాఠశాలల అధికారులు, విద్యార్థులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.