calender_icon.png 5 October, 2024 | 6:47 PM

సమన్వయంతో సమస్యలకు చెక్

05-10-2024 12:25:37 AM

జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి

జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులతో కలిసి అభివృద్ధ్ది పనుల పరిశీలన

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4(విజయక్రాంతి): హైటెక్ సిటీ, మాదాపూర్‌లో ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు జలమండలి, పోలీస్, జీహెచ్‌ఎంసీ అధికారులు సం యుక్త కార్యాచరణను చేపట్టబోతున్నట్లు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు.

శుక్ర వారం ఆయా ప్రాంతాల్లో సైబరాబాద్ జాయింట్ సీపీ జోయల్‌డేవిస్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. లెమన్ ట్రీ హోటల్ నుంచి ట్రిడెంట్ హోటల్ వరకు చేపట్టబోతున్న రోడ్డు విస్తరణ పనులను, మాదాపూర్ యశోదా ఆస్పత్రి వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో ధ్వంసమైన సీవరేజీ పైప్‌లైన్‌ను ఆయన పరిశీలించారు.. 

మురుగు చేరకుండా చర్యలు

మాదాపూర్ పర్యటన అనంతరం పర్వతానగర్‌లో జలమండలి ఎండీ పర్యటిం చారు. పర్వతానగర్ చౌరస్తా నుంచి సున్నంచెరువు మధ్య ప్రైవేటు వ్యక్తులు ఔట్‌లెట్‌ను ధ్వంసం చేసినట్లు గుర్తించారు. కొత్త సీవరేజ్ పైప్‌లైన్ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. డైరెక్టర్ ఆపరేషన్స్  స్వామి, జీఎం, మేనేజర్ పాల్గొన్నారు.