- వారి కదలికలపై నిఘా
- ప్రతి జోన్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల దందాకు చెక్ పెట్టేందుకు ఆర్టీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయానికి ఎవరెవరూ వస్తున్నారు, ఏమేమీ పనులు చేస్తున్నారనే విషయాలను పరిశీలించేందుకు నిఘా పెట్టనున్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఏజెంట్లపై నిఘా ఉంచడం ఒక అంశం అయితే, అధికారులపై తరచూ జరుగుతున్న దాడులు, అధికారులతో మాట్లాడే సమయంలో సదరు వ్యక్తులు ప్రవర్తించే విధానం తదితర విషయాలను రికార్డుగా నమోదు కావడానికి వీలుంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెంట్రల్ జోన్ పరిధిలోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాల్లో ఇప్పటికే 19 కెమెరాలు ఏర్పాటు చేయగా, అదే విధంగా మిగతా జోన్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పా టు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ప్రతిరోజు వేలాదిగా విజిట్..
హైదరాబాద్ నగర పరిధిలోని ఖైరతాబాద్ (సెంట్రల్ జోన్), సికింద్రాబాద్ (నార్త్ జోన్), టోలిచౌకి (వెస్ట్ జోన్), మలక్‌పేట్ ( ఈస్ట్), చాంద్రాయణగుట్ట (సౌత్) ఆర్టీఏ కార్యాలయాలకు ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ముఖ్యంగా వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రతిరోజు 1000 వరకు అవుతుంటాయి. అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్, నంబరు ప్లేట్లు ఇతరత్రా పనుల నిమిత్తం వాహనదారుల రాకతో నిరంతరం సందడి నెలకొంటుంది.
అంతేకాకుండా, వాహనదారులకు వివిధ పనులు చేయించి పెట్టడానికి ఏజెంట్లు సైతం వందల సంఖ్యలో దర్శనమిస్తుంటారు. ఇదిలా ఉండగా, ఇటీవల ఓ యూనియన్ నాయకుడు జేటీసీ రమేశ్‌తో మాట్లాడుతూనే ఆయనపై తీవ్రంగా దాడి చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం సైతం స్పందించి, అధికారులను సముదాయించా ల్సి వచ్చింది. ఈ క్రమంలో వాహనదారు లు, వినియోగదారులు అధికారులతో చర్చించే సమయంలో, సంప్రదించే సమయంలో ఎవరు తప్పు చేశారనే విషయా లను కచ్చితంగా నిరూపణ చేసేందుకు కూ డా సీసీ కెమెరాలు దోహదపడనున్నాయి.
ప్రతి జోన్‌లోనూ నిఘా నేత్రాలు..
ఇటీవల నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేసిన సమయంలో ముఖ్యంగా ఏజెంట్లపైనే దృష్టి సారించారు. ఈ సమయంలో అనేక మంది ఏజెంట్లను అధికారులు నగదు, ఇతర పత్రాలతో సహా పట్టుకున్నారు. కార్యాలయాల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఏజెంట్లకు చెక్ పెట్టవచ్చని అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తు తం నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో కేవలం సెంట్రల్ జోన్‌లోనే నిఘా కెమెరాలు ఉన్నాయి. మిగతా జోన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు.
ఇటీవల చోటుచేసుకు న్న పలు పరిణామాల నేపథ్యంలో మిగతా జోన్ల కార్యాల యాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చా రు. ప్రస్తుతం సెంట్రల్ జోన్ కార్యాలయం ఆవరణలోనే రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయం ఉండడంతో ప్రస్తుతం ఇక్కడ మొత్తం 19 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ కార్యాలయానికి ఉన్నట్టుగానే ప్రతి జోనల్ కార్యాలయానికి కనీసం 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.