నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా మహ్మద్ నగర్ మండలంలోని ఎరువుల దుకాణాలను, గోదాములను మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా నిల్వలు, నిల్వ పట్టికలు నిల్వ రిజిస్టర్ లు పరిశీలించారు. గోదాముల్లో నిల్వ ఉంచే ఎరువులు నిల్వ రిజిస్టర్, ఎపోస్ యంత్రంతో సరితూగేల ఎప్పటికప్పుడు నవీకరించాలని వ్యాపారులను ఆదేశించారు. ఆధార్ కార్డు తీసుకుని వచ్చిన రైతులకు ఎపోస్ యంత్రం ద్వారా మాత్రమే ఎరువులు విక్రయించాలని ఆదేశించారు. అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి మధుసూదనరావు ఉన్నారు.