calender_icon.png 15 January, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమ తండ్రి తమకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మోసం

01-12-2024 08:30:55 PM

30 ఏళ్లుగా సంపాదించుకొని తమతో ఉండలేదు

తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు

మాజీ డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి

కామారెడ్డి (విజయక్రాంతి): తమ తండ్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తమకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి 30 ఏళ్లుగా వెంట ఉంచుకుంటే తమపైనే తప్పుడు విమర్శలు చేస్తున్న వ్యక్తి పద్దతి మార్చుకోవాలని మాజీ డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. బీర్కూర్ మార్కెట్ కమిటి చైర్మన్ పాలకవర్గం ప్రమాణాస్వీకార కార్యక్రమానికి హజరై మాట్లాడారు. తమకు ద్రోహంచేసిన వ్యక్తిని వదిలేది లేదని గాటుగా మాట్లాడారు. 30 సంవత్సరాలుగా తన తండ్రి అభిమానంతో చేరదీస్తే ఆర్థికంగా ఎదిగిన పెద్దమనిషి తమపై విమర్శలు చేస్తున్నారని ఆ వ్యక్తికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

తమ ఇద్దరు అన్నదమ్ముళ్ల మాటలను లెక్కచేయకుండా మా తండ్రి శ్రీనివాస్‌ రెడ్డి ఆ పెద్ద మనిషి మాట వినేవాడని ఈ విషయం నియోజకవర్గ ప్రజలందరికి తెలుసు అన్నారు. పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని నమ్మించి మోసం చేశారన్నారు. భవిష్యత్తులో ఆ వ్యక్తికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తిని వదిలే ప్రసక్తే లేదన్నారు. మోసం చేసిన చరిత్ర ఎవరిదో నియోజకవర్గ ప్రజలకు తెలుసు అన్నారు. సాటు మాటుగా మాటలు మాట్లాడటం కాదు వేదికపైగా వచ్చి దమ్ముంటే అవాకులు, చవాకులు పలకడం ఆ పెద్ద మనిషి మానుకోవాలని హితవు పలికారు. 30 ఏళ్లు వెంటగా ఉండి మోసం చేశారని తన తండ్రి ఇంకా మనోవేదన చెందుతున్నారని పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు.