రూ.8 లక్షల విలువైన కల్తీ మద్యం పట్టివేత
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 (విజయక్రాంతి): ఖరీదైన మద్యం సీసాల్లో తక్కువ ధర మద్యాన్ని విక్రయిస్తున్న ఒడిశాకు చెందిన ముఠా సభ్యులను హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వారి నుంచి రూ.8 లక్షల విలువైన కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్, అమీర్‌పేట్ సీఐ బానోత్ పటేల్‌లు తమ సిబ్బందితో కలిసి కృష్ణానగర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిచారు. అనుమానం వచ్చి మనీశ్, పవన్ అనే వ్యక్తుల వద్ద తనిఖీ చేయగా వారి వద్ద తొమ్మిది ఖరీదైన ఎన్డీపీ మద్యం బాటిళ్లు లభించాయి.
వారిని విచారించగా ఖరీదైన సీసాల్లో తక్కువ ధరల మద్యాన్ని నింపి అమ్ముతున్నట్లు వెల్లడించారు. వారిచ్చిన సమాచారంతో అయ్యప్ప సొసైటీ సాయినగర్‌లోని ఓ ఇంట్లో రుద్రప్రతాప్ రౌత్, సత్యప్రకాశ్ రౌత్, రింకుజాన్ లను పట్టుకున్నారు.