calender_icon.png 17 October, 2024 | 7:51 PM

సి.హెచ్.సి. వైద్యుల, సిబ్బంది కొరత తీర్చాలి..

17-10-2024 05:06:33 PM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడ నియోజకవర్గం పరిధిలోని పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలోగల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గల వైద్యుల సిబ్బంది కొరతను తక్షణమే తీర్చాలని బహుజన సమాజ్ వాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సిహెచ్సి ఎదుట ప్లాకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక ఆరోగ్య కేంద్రంలో సీఎంఆర్ఎం మిషన్, డిజిటల్ ఎక్స్రే మిషన్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు ఎముకల సమస్య తలెత్తితే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

దీంతో క్షతగాత్రులకు ఆర్థిక సమస్య తలెత్తుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 600 పైగా అవుట్ పేషెంట్లు వచ్చే ఈ ఆసుపత్రిలో సరిపడా వైద్యులు లేకపోవడం, ఉన్న వైద్యులు సకాలంలో విధులకు హాజరు కాకపోవడంతో రోగులు గంటలు తరబడి ఆసుపత్రిలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. 1 లక్ష 30వేలు జనాభా కలిగిన పాల్వంచ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం శోచనీయమన్నారు. డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించే చేతులు నేర్పిన అధికారులు దానికి సంబంధించిన సిబ్బందిని నియమించలేదన్నారు. తక్షణమే సిబ్బంది కొరత తీర్చాలని మందన కొడత లేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు కోళ్ల పూడి ప్రవీణ్ కుమార్, టంగు శ్రీనివాస్, కటికల రంజిత్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.