పూనే: పీకేఎల్ 11 లీగ్ మ్యాచ్‌లు నేటితో సమాప్తం కానున్నాయి. ప్లే ఆఫ్స్‌లో చోటు సంపాదించాలని చూస్తున్న యూముంబాకు నేడు గెలుపు కీలకం కానుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌ల్లో పునేరి పల్టన్ 42 తేడాతో తమిళ్ తలైవాస్ మీద, దబంగ్ ఢిల్లీ 45 తేడాతో గుజరాత్ మీద విజయం సాధించాయి. నేడు బెంగాల్ మీద గెలిస్తే యూముంబా ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకోనుంది. లేని పక్షంలో తెలుగు టైటాన్స్‌కు ప్లే ఆఫ్స్ బెర్తు కన్ఫామ్ అవుతుంది.
మరి ముంబై గెలుస్తుందో లేదో వేచి చూడాలి. హర్యానా స్టీలర్స్ 16 విజయాలతో టాప్‌లో కొనసాగుతోంది. ఐదో ప్లేస్‌లో క్వాలిఫై అయిన జైపూర్ కూడా తెలుగు లాగే 12 విజయాలే సాధించినప్పటికీ ఆ జట్టుకు 2 డ్రాలు ఉన్నాయి. తెలుగు టైటాన్స్‌కు ఒక్క డ్రా కూడా లేకపోవడం గమనార్హం.