07-03-2025 12:00:00 AM
ఛావా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో దినేశ్ విజన్ నిర్మించిన ఈ చిత్రం లో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ కౌశల్ పోషించారు. తొలుత హిందీలో విడుదలై, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల్లో తన స్థానాన్ని పదిలపర్చుకుందీ సినిమా. ప్రస్తుతం దీని వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు చేరువలో ఉన్నా యి. ఇటీవల విడుదల చేసిన తెలుగు ట్రైలర్ దాదాపు 5 మిలియన్ల వ్యూస్ సాధించింది.
ఈ సిని మా మార్చి ౭న తెలుగు వెర్షన్ 550 పైచిలుకు స్క్రీన్లలో థియేట్రికల్ రిలీజ్ కానుం ది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు విక్కీ కౌశల్ ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. “మా ఛావా’ను తెలుగులోకి డబ్ చేయాలంటూ మొదటి వారం నుంచే డిమాండ్ చేశారు.
ఇప్పుడు తెలుగులో తీసుకొస్తున్నందుకు మేం గర్వపడుతున్నాం. గొప్ప మరాఠా యోధుల్లో ఒకరైన శంభాజీ మహారాజ్ త్యాగాన్ని బిగ్‌స్క్రీన్‌పై చూసే అవకాశం మీకు లభిస్తుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు విక్కీ కౌశల్.