09-03-2025 12:55:18 AM
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత విశేషాలతో తెరకెక్కింది ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శక త్వంలో దినేశ్ విజన్ హిందీలో నిర్మించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 7న తెలుగులో రిలీజ్ చేయగా, ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. శనివారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్ లో నిర్మాత బన్నివాస్ మాట్లాడుతూ.. ‘చరిత్రను గొప్ప సినిమాగా ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ లక్ష్మణ్.
స్వేచ్ఛ, స్వాతంత్య్రం విలువ ఈ తరానికి తెలియాలంటే తల్లిదండ్రులు ఇలాంటి సినిమాలను పిల్లలకు చూపించాలి. ‘ఛావా’ సినిమా మాత్రమే కాదు.. గ్రేట్ ఎమోషన్’ అన్నారు. నటుడు వినీత్ కుమార్ సింగ్, మాడ్డాక్ సీఎఫ్‌వో దివ్యాంశ్ గోయల్, తెలుగు డైలాగ్ రైటర్ సామ్రాట్, తెలుగు డబ్బింగ్ డైరెక్టర్ రాఘవ, లిరిక్ రైటర్ శ్రీమణి కూడా తమ అభిప్రాయాలు, అనుభూతుల్ని ఈ వేదికపై పంచుకున్నారు.