విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దినేష్ విజన్ నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. “ఛావా సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రిపేర్ అయ్యాను.
యుద్ధాలు, గుర్రపు స్వారీల్లో శిక్షణ తీసుకున్నా. వీటన్నంటి కంటే కూడా ఛత్రపతి శంభాజీ మహారాజ్ అనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం, నా మనసుని ఆ పాత్ర కోసం సన్నద్ధం చేసుకోవడం సవాలుగా అనిపించింది. నిజమైన యోధుల కథను చెబుతున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది” అన్నారు. రష్మిక మందన్న మాట్లాడుతూ.. “ఛావా’ చిత్రంలో మాటలకు అందని భావం ఉంటుంది.
ఇందులో ఓ దైవత్వం, అంతులేని ప్రేమ ఉంటుం ది. అందుకే ఈ చిత్రాన్ని చేయాలని ఫిక్స్ అయ్యా. ఈ మూవీని చూసిన ప్రతీ సారి నేను ఏడ్చేస్తాను. అంత అద్భుతంగా ఉంటుంది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, ‘జానే తూ’ అనే పాట అందరినీ మెస్మరైజ్ చేస్తుంటుంది. విక్కీ చుట్టూ అద్భుతమైన ఆరా ఉంటుంది. ఆయన పక్కన నిలబడితేనే ఓ మ్యాజిక్ జరుగుతుంది” అన్నారు.