calender_icon.png 20 October, 2024 | 3:17 AM

రైతు భరోసాపై చావుకబురు చల్లగా

20-10-2024 12:46:20 AM

  1. జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం
  2. మాజీ మంత్రి హరీశ్

సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 19: రైతు భరోసాపై మంత్రి తుమ్మల చావు కబురు చల్లగా చెప్పారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ చేపడతామన్న సీఎం.. రూ.15 వేల రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్ర శ్నింరు. 

మాజీ సీఎం కేసీఆర్ జీవో 55 అమలు చేస్తే, కాంగ్రెస్ ప్రభు త్వం జీవో 29 తెచ్చిందని, దాంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుండగా.. అదే రాజ్యాం గానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు.

ఓపెన్ కేటగిరిలో ఉద్యోగం సాధించే అవకాశం ఉన్నప్పటికీ.. వారిని రిజర్వేషన్‌కు కన్సిడర్ చేయ డం సరికాదన్నారు.సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, బీఆర్‌ఎస్ పార్టీ లీడర్లు రాధాకృష్ణ శర్మ, రాజనర్సు, సాయిరాం పాల్గొన్నారు.