calender_icon.png 20 January, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు అంబరాన్నంటాలి

20-01-2025 01:11:05 AM

* ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

పెబ్బేరు, జనవరి 19: శ్రీ శ్రీ చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు అంబరాన్నంటే విధంగా ఏర్పా ట్లు చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకొని పీజెపి క్యాంపు కార్యాలయం ఆవరణంలో ఆదివారం నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రీమియర్ లీగ్(పీపీఎల్) క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి క్రీడాకారులను ఉత్సా హపరిచారు.

చెలిమిళ్లలో ప్రీమియర్ లీగ్ (సిసిఎల్)క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. మార్కెట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన వాలీ బాల్ క్రీడాలను ప్రారంభించారు. గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న బాధితులు డాక్ట ర్ వేణుగోపాల్, కౌన్సిలర్ అక్కమ్మ భర్త మంద బాబులను పరామర్శించి భరోసా కల్పించారు.

యువజన కాంగ్రెస్ నాయ కుడు శివ కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రె స్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, కాంగ్రె స్ నాయకులు రంజిత్ కుమార్, దయాకర్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, సురేందర్ గౌడ్, సత్య నారాయణ, యాపర్ల రాం రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.