calender_icon.png 20 April, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాట్ల ముత్తయ్య జీవితం స్ఫూర్తి దాయకం...

12-04-2025 07:18:11 PM

మట్టిపల్లి సైదులు..

మోతే: చాట్ల ముత్తయ్య జీవితం స్ఫూర్తిదాయకంమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. శనివారం రావి పహాడ్ గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు చాట్ల ముత్తయ్య సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. అనేక పోరాటాలకు త్యాగాలకు నిలయమైన రావి పహాడ్ గ్రామంలో సామాన్య దళిత వ్యవసాయ కార్మిక కుటుంబంలో పుట్టిన చాట్ల ముత్తయ్య తన జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పని గొప్ప నేత అని అన్నారు. చదువు లేకున్నా పార్టీ నిర్ణయాలను, విధానాలను తూచా తప్పకుండా అమలు చేశారని అన్నారు. ఎన్ని నిర్బంధాలు వచ్చిన, ఆటంకాలు వచ్చిన నికార్సైన కమ్యూనిస్టుగా జీవించారని అన్నారు.

రావి పహాడ్ గ్రామంలో శత్రువుల దాడులను ఎదుర్కొని గ్రామంలో ఎర్ర జెండాను నిలబెట్టడంలో ముత్తయ్య ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. పార్టీలో చీలికలు వచ్చినప్పుడు సైతం సిపిఎం వైపు నిలిచి పార్టీని కంటికి రెప్పలా కాపాడిన త్యాగశీలి చాట్ల ముత్తయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం సైదులు, జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, ఎస్డబ్ల్యుఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బత్తుల సుధాకర్, జిల్లా కార్యదర్శి సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు సోమ గాని మల్లయ్య, సిపిఎం శాఖ కార్యదర్శి ఎర్రబోయిన మాల్సుర్, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి వెలుగు మధు, సిపిఎం పార్టీ గ్రామ శాఖ నాయకులు పొడపంగి ఈదయ్య, కొప్పు ఎంకన్న, ములకలపల్లి మాల్సుర్, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బొజ్జ శ్రీను, బత్తుల తిరుమలేష్, కుటుంబ సభ్యులు చాట్ల బుచ్చిబాబు, చాట్ల మధు, చంటి, కూతురు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.