15-04-2025 01:10:46 AM
కడ్తాల్, ఏప్రిల్ 14 : కడ్తాల మండల కేంద్రానికి చెందిన పలువురు బాధిత కుటుంబాలను కడ్తాల్ మండల బీఆర్‌ఎస్ శ్రేణులు సోమవారం పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన మూడ పాప య్య మరియు ముత్యాల పోచమ్మ అనా రోగ్యంతో కొన్నిరోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు బాధిత కుటుంబా లను పరామర్శించారు. మృతుల కుటుం బాలకు మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టు ద్వారా 10వేలు, ,మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ 10వేలు, మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి 10వేల చొప్పున మొత్తం 30 వేల ఆర్థిక సహాయం అందించారు.
మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుం టామని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చా రు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు మాట్లాడుతూ మండల పరిధిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమున్నామని, ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటా మని అన్నారు. ఈ కార్యక్రమంలో మూడ బాల య్య, కేశని మహేష్,మంగలపల్లి నర్సింహ్మ, కంబాల అంజి,మాధారం మహేష్, జంగయ్య,సురేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు.