నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బుధవారం పేట్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో గురువారం సీనియర్ ఆచార్యులు సూర్యనారాయణ ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. దేశం పట్ల ప్రజల పట్ల ప్రేమను పెంచుకోవాలని నిజాయితీగా విద్యార్థులు మసులుకోవాలని క్రమశిక్షణతో ముందుకువెళ్లాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.