మునగాల; ఫిబ్రవరి 4: శ్రీ రామలింగేశ్వర హనుమాన్ దేవాలయానికి రథం బహూకరించారు. మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ దేవరం వెంకరెడ్డి జ్ఞాపకార్థం కుమార్తె అల్లుడు గజ్జెల అనూష సంతోష్ రెడ్డి మనవడు రిషిక్ రెడ్డి రూ. 1లక్ష 50వేల విలువ చేసే రథంను రథసప్తమి సందర్భంగా తయారు చేసినటువంటి రధంను పూజ అనంతరం దేవాలయాల అధ్యక్షుడు తుమ్మల వీరస్వామి.
కార్యదర్శి గంధం అంజయ్య కు అందజేశారు. రథం తయారు చేసిన వారిని ఘనంగా సత్కరించినారు. కార్యక్రమంలో లకుమారపు ప్రసాద్, పెనుగొండ వెంకట దుర్గాప్రసాద్, ఉప్పల జానకి రెడ్డి, వేట సైదారావు, శర్మ, పోటు రామకృష్ణ, చంద వేణు, పాల్గొన్నారు.