calender_icon.png 19 March, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్రపురి హౌసింగ్ సొసైటీ కమిటీపై 12 కేసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం హర్షనీయం..

18-03-2025 06:59:24 PM

చిత్రపురి సాధన సమితి అధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్, ప్రజానాట్య మండలి సినిమా శాఖ కార్యదర్శి మద్దినేని రమేష్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): చిత్రపురిలో దాదాపుగా 300 కోట్ల రూపాయల భూముల కుంభకోణం, ఫ్లాట్ల కుంభకోణం, 449 సభ్యత్వాల టాంపరింగ్, 189 మార్ఫింగ్ ఆలోట్మెంట్స్, ఫోటోలు లేని 220 సభ్యులు, 336 అక్రమ రిజిస్ట్రేషన్ లు జరిగినట్టుగా ప్రభుత్వమే ధ్రువీకరించిన నేపథ్యంలో ఆర్ధిక నేరాల విభాగానికి (ఎకనామిక్ ఆఫిన్స్ వింగ్) చెందిన సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే 12 ఛార్జ్ షీట్ లు LB నగర్ కోర్ట్ లో పలు కేసులు నమోదు చేసి చిత్రపురి హోసింగ్ సొసైటీ కమిటీపై 12 కేసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడంపై చిత్రపురి సాధన సమితి అధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్, ప్రజానాట్యమండలి సినిమా శాఖ కార్యదర్శి మద్దినేని రమేష్ లు మంగళ వారం ఒక ప్రకటనలో హార్షం వ్యక్తం చేసారు. 

బెయిల్ కండిషన్స్ దిక్కరణ విషయంలో సుప్రీం కోర్ట్ స్పెషల్ లీవ్ పిటిషన్ ని తిరస్కరించిన తర్వాత, ఇప్పటికే చిత్రపురి హోసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ గత 20 రోజుల నుండీ చర్లపల్లి జైలులో ఉన్నాడని, ఈ సమయంలో మరో 12 కేసులు ఛార్జ్ షీట్ కావటం, చిత్రపురి అక్రమార్కులు చేసిన అన్నీ కుట్రలు వెలుగులోకి వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వల్లభనేని అనిల్ కుమార్ పై ఇంకా కఠిన చెర్యలు తీసుకొని సినీరంగానికి చెందిన అర్హులైనవారికి ప్లాట్ లు, ఫ్లాట్ లు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేసారు.