calender_icon.png 7 October, 2024 | 2:49 AM

బుడ్డి దీపం

07-10-2024 12:00:00 AM

ఆరోజుల్లో పాత వస్తువుల ప్రత్యేకతే వేరు. టెక్నాలజీలేని కాలంలోనూ ఆతరం వస్తువులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలాంటివాటిలో బుడ్డిదీపం ఒకటి. ఇంటి లో కరెంటు లేకపోతే వాడుకునేవే ఈ బుడ్డి దీపాలు. కిరోసిన్‌తో  వెలిగే ఈ దీపాలు అప్పట్లో చాలా ఫేమస్. ప్రతిరోజు పొగపట్టిన ఆ చిమ్నీని తుడవటం ఓ దినచర్యగా ఉండేది.

సామాన్యమైన కుటుంబం ఉద యం లేవగానే ముందుగా కిరోసిన్ ఆయిల్ (బుడ్డి) దీపాన్ని ఆర్పి ఇతర పనులు చేసేకునేవారు. చాలామంది చదువులు ఈ దీపాల కింద సాగేవి కూడా. ఒకవైపు పొగచూరుతున్నా.. ఒప్పిగ్గా చదువుకొని ఉన్నత చదువులు చదివారు. ఆతరంవారికి బుడ్డి దీపం ఒక ఎమోషన్ అయితే.. ఈతరంవారికి ఓ వస్తువుగా మిగిలింది. కాలక్రమేణా విద్యుత్ వాడకం పెరిగి ఎలక్ట్రిక్ బల్బులు, సోలార్ దీపాలు వెలుగులో రావడంతో బుడ్డి దీపం కనుమరుగైంది.