జమ్ముకశ్మీర్,(విజయక్రాంతి): జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బ్యానర్ ను సభలో ప్రదర్శించారు. అనంతరం ప్రతిపక్ష నేత సునీల్ వర్మ బ్యానర్ ప్రదర్శనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 పునరుద్ధరించే తీర్మానాన్ని జమ్మకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి బుధవారం అసెంబ్లీలో ప్రేశపెట్టారు.
ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్యలు జరుపాలని తీర్మానంలో పేర్కొన్నారు. అయితే ఈ తీర్మానాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేత సునీల్ శర్మ వ్యతిరేకించారు. బీజేపీ, నేషనల్ కన్ఫరెన్స్ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. సభ్యులు పేపర్లు చించి స్పీకర్ పైకి విసిరేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో స్పీకర్ సభను వాయిదా వేశారు.