- ఇంద్ర వల్లభ ఆలయంలోని ఓ కట్టడంపై కప్పిన వ్యక్తి
- మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించిన పోలీసులు
నిజామాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ పరిధిలో పురావస్తు శాఖ అధీనంలో ఉన్న వంద స్తంభాల గుడి(ఇంద్ర నారాయణ వల్లభ ఆలయం)లో సమాధిగా చెప్పబడుతున్న కట్టడంపై జిలాప్ చాదర్‌ను కప్పడం మంగళవారం కలకలం రేపింది.
ఆలయ ప్రాంగణంలో సమాధిగా చెప్పబడుతున్న కట్టడంపై రహీం అనే యువకుడు చాదర్ కప్పినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంఘటన స్థలానికి రెవెన్యూ, పోలీస్ అధికారులు హుటాహుటిన చేరుకున్నారు.
పరిస్థితిని సమీక్షించి, బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే రహీంకు మతిస్థిమితం లేదని జిల్లా యంత్రాంగం తెలిపింది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం ఆలయం వద్ద భద్రతా ఏర్పా ట్లు చేసింది. ఇక్కడ పూజలు, నమాజులు చేయకుండా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.