calender_icon.png 23 January, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామసభల్లో గందరగోళం

23-01-2025 12:31:43 AM

  1. రెండోరోజూ అదే తంతూ
  2. పలు చోట్ల ఉద్రిక్తత.. పోలీసుల జోక్యం 
  3. రెండు రోజుల్లో 9,844 గ్రామాల్లో సభలు 
  4. 60 శాతం సభలు పూర్తి 

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామసభలు రెండోరోజూ కొనసాగుతున్నాయి. బుధవారం రెండోరోజు నిర్వహించిన గ్రామసభల్లోనూ మొద  రోజులాగే గందరగోళ పరిస్థితి నెలకొన్నది. అధికారులు జాబితాలోని పేర్లు చద  సభల్లో అనర్హత సాధించిన లబ్ధిదారు  నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.

అనర్హులను ఎంపిక చేసి, అర్హులను విస్మరించారంటూ నిరసన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల నిరసనలు శృతిమించడంతో ఉద్రిక్తలతకు దారి తీశాయి. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పారు. కాగా రాష్ర్ట వ్యాప్తంగా రెండు  60 శాతం వరకు గ్రామ, వార్డుసభలు ముగిశాయి. రెండు రోజుల్లో మొత్తం 9,844 గ్రామాల్లో సభలు నిర్వహించారు.

బుధవారం 4,663 గ్రామ, వార్డు సభలు నిర్వహించారు. నాలుగు పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు 10 లక్షల 9 వేల 131 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. వివిధ జిల్లాల్లో మంత్రులు పొంగు  శ్రీనివాస్‌రెడ్డ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,  పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహా గ్రామసభల్లో పాల్గొన్నారు. 

టెంట్లు పేకేసిన గ్రామస్థులు

ఖమ్మం(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంతో పాటు రఘునా  కొణిజర్ల, కారేపల్లి, వైరా, మధిర,  సత్తుపల్లి, తల్లాడ, చింతకాని, బోనకల్ మండలాల్లో అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొణిజర్ల మండలం సిద్ధిఖ్‌నగర్ గ్రామసభలో జాబితాలో కాంగ్రెస్ కార్య  పేర్లే ఉన్నాయంటూ గ్రామస్థులు ఆగ్రహంతో సభ వద్ద వేసిన టెంట్‌ను పీకేశారు.

పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. కూసుమంచి మండలం గట్టు  సభలో తమ చేతుల్లో ఉన్న కాగితాలను చింపివేసి, నిరసన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా రేషన్‌కార్డులు, ఇండ్లు లేక ఇబ్బందిపడుతున్నామని, గ్రామ సభ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని నిరసన వ్యక్తం చేశారు. అధికారులు కాకుండా కాంగ్రెస్ నాయకులే జాబితా తయారు చేసినట్లు ఉన్నాయంటూ నిరసన తెలిపారు. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల గొడవ

జనగామ(విజయక్రాంతి): జనగామ మండలంలోని వడ్లకొండ, పెద్దపహాడ్ గ్రామాల్లో గొడవ జరిగింది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇందిరమ్మ పథకంలో తమ పేర్లు జాబితాలో రాకపోవడంతో వడ్లకొండ గ్రామంలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారికి బీఆర్‌ఎస్ నాయకులు గొంతు పలికి అధికారులతో వాగ్వాదానికి దిగారు.

కేవలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పేర్లు మాత్రమే జాబితాల్లో పొందుపరిచారని ఆరోపించారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు నెట్టివేసుకోవడంతో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.

పెద్దపహాడ్ గ్రామంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. కాంగ్రెస్ నాయకులు సూచించిన పేర్లే ఎక్కించుకున్నారంటూ పలువురు గొడవ చేశారు. 

చింతలపాలెం, నక్కగూడెంలో

హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామసభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్హత ఉన్నా జాబితాలో తమ పేర్లు లేవని కొందరు అధికారులను నిలదీశారు. చింతలపాలెం మండల కేం  అధికారులపై ప్రశ్నలవర్షం కురిపించారు. 

అధికారుల నిలదీత.. నిరసనలు

ఆదిలాబాద్(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరహిస్తున్న ప్రజా పాలన గ్రామసభల్లో గందరగోళం నెలకొంది. తాంసి మండలం వడ్డాడి గ్రామం   జాబితాలో అనరులను గుర్తించారని అధికారులతో గ్రామస్థులు వాగ్వాదా  దిగారు. అధికారులపైకి దూసుకెళ్లడంతో డీఎస్పీ జీవన్‌రెడ్డి కల్పించుకుని పోలీసులు రంగంలోకి దిగి గ్రామస్థులకు సర్దిచెప్పారు.

జైనథ్ మండలం ఆనంద్‌పూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అరుల పేర్లు లేవంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో ప్రొటోకాల్ రగడ నెలకొంది. గ్రామసభ ప్రాంగణంలో అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ ఫొటో లేదని ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు.

అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మె  ఫొటో పెట్టకపోవడం అవమానించడమేనని అధికారులతో వాగాదానికి దిగారు. ఆది  మున్సిపల్ పరిధిలో పిట్టలవాడలో జరిగిన సభలో తమ పేర్లు ఎందుకు రాలేదని ప్రజలు అధికారులను ప్రశ్నించారు.