22-12-2024 01:29:03 AM
రాష్ట్రంలో కేటీఆర్ నామ జపం కనిపిస్తోంది. ఎక్కడ చూసి నా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు గురించే వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక గత ప్రభుత్వ అవినీతిపై యుద్ధం ప్రకటించింది. ప్రభుత్వం ప్రస్తావిస్తున్న ఏ అంశమైనా కేటీఆర్ వైపే చూపుతోంది. ఈకార్ రేసింగ్ నిధుల బదిలీ కుంభకోణంలో ఏఔ1గా కేసు నమోదవ్వడం విస్తృత చర్చకు దారితీసింది.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తున్న క్రమంలో బీఆర్‌ఎస్ చేసిన సెల్ఫ్ గోల్‌తో మరో రెండు కేసులు కేటీఆర్ మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. ఓఆర్‌ఆర్ టోల్ టెండర్ల అంశంపై కేటీఆర్‌ను సమర్థించే క్రమంలో విచారణ చేసుకోవాలని హరీశ్‌రావు చేసిన సవాల్ సమస్యను మరింత జటిలం చేసింది.
ఓఆర్‌ఆర్ టోల్ టెండర్లపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో.. మరోసారి కేటీఆర్ పేరు వార్తాంశంగా మారింది. ధరణి నిర్వహణ సేవలు అప్పగించిన కంపెనీ కూడా కేటీఆర్ సన్నిహితులదేనని ప్రభుత్వం ఆరోపిస్తుండటం చూస్తుంటే భవిష్యత్ అంతా కేటీఆర్‌కు కేసుల బాధ తప్పేలా లేదని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.
మల్లాడి