calender_icon.png 30 April, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పనివేళల్లో మార్పులు

10-04-2025 01:54:10 AM

కృతజ్ఞతలు తెలియజేసిన ఏఐటియుసి నాయకులు

 కొత్తగూడెం ,ఏప్రిల్ 9 (విజయ క్రాంతి )సింగరేణిలో సివిక్, సివిల్ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు, తీవ్ర ఎండల నేపథ్యంలో పనివేళలో మార్పులు చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ -ఏఐటియుసి  విజ్ఞప్తి మేరకు సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. గురువారం నుండి పని వేళల్లో మార్పులు చేస్తూ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేయ ను న్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అందుకు ఏఐటీయూసీ సింగరేణి యాజమాన్యానికి  కాం ట్రాక్టు వర్కర్స్ యూనియన్ -ఏఐటియుసి, కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణ య్య,ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కిష్టాఫర్లు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేట్ లోని వాటర్ సప్లై బర్మా క్యాంపు, హాస్పటల్ ఏరియా, బంగ్లోస్ పని ప్రదేశాలలో,కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశాలను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  నాయకులు మాట్లా డుతూ, వేసవి ఎండలు మండుతున్న నేపద్యంలో పనివేళలో మార్పులు చేయడం కాంట్రాక్ట్ కార్మికులకు కొంత ఉపష మనం కలుగుతుందని తెలిపారు.వడదెబ్బకు గురికాకుండా పూర్తిస్థాయిలో రక్షణ చర్యలను చేపట్టాలని కోరారు.సింగరేణి ఫారెస్ట్ విభాగంలో పనిచేస్తున్న నర్సరీ, గార్డెనింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పనివేళలో మార్పులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు విజయకృష్ణ, వినోద్ ,వెంకటస్వామి, రమణ,బాలాజీ,లక్ష్మి, అప్పారావు,భాస్కర్, విక్రం, గణేష్,రంజిత్, కృష్ణమూర్తి, రాజు,చుక్కయ్య,రాము తదితరులు పాల్గొన్నారు.