21-02-2025 11:57:26 PM
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): 2025 విద్యాసంవత్సరానికి గానూ ఇంజినీరింగ్ సిలబస్‌లో మార్పులు చేయనున్నారు. ఈమేరకు నియమించిన కమిటీ పలు సిఫార్సులు చేసింది. ప్రతీ యూనివర్సిటీలో సెమిస్టర్‌కు 20 క్రెడిట్ల చొప్పున నాలుగేళ్లకు 160 క్రెడిట్లు ఉంటాయని కమిటీ సూచించింది. మరో 20 క్రెడిట్లతో ఆనర్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను అందుబాటులో తీసుకురానుంది. కోర్ బ్రాంచ్‌లైన సివిల్స్, మెకానికల్ కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డాటా ఎంట్రీ, మెషిన్ లెర్నింగ్ తదితర సబ్జెక్టులను ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్, ఫీల్డ్ విజిట్స్, ప్రాక్టిస్ ప్రొఫెసర్లను నియమించుకోవడం, ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఎక్స్‌చేంజ్, పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చేలా పలు సిఫార్సులను కమిటీ చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.