హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌ను ఇకపై జయప్రకాశ్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు 2024, ఫిబ్రవరి 17న ఒప్పందం కుదరగా, తాజాగా ‘ఈఎస్‌సీఐ’ పేరును ‘జేపీఎన్‌సీఈ’గా పరిగణిస్తున్నారు. ఇకపై జయప్రకాశ్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ చైర్మన్ ‘జేపీఎన్‌సీఈ’కి ప్రాతినిధ్యం వహిస్తారు.
ఈఎస్‌సీఐ/ఐఈఐ వివిధ డొమైన్లలో విద్యార్థులు, అధ్యాపకులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్‌లకు సేవలందిస్తోంది. విశ్వసనీయ ట్రాక్ రికార్డ్‌తో దేశవ్యాప్తంగా అనేక కేంద్రాలను నెలకొల్పి తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. అంతర్జాతీయ భాగస్వామ్యాలు, ఆఫ్ స్కిల్లింగ్, ఇన్నో వేషన్ ప్రోగ్రామ్‌లను అందించడంలో విస్తారమైన అనుభవం జేపీఎన్‌సీఈ సొంతం.
అవగాహన ఒప్పంద పరిధి/లక్ష్యాలు
* ఎన్‌బీఏ(నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్) ద్వారా అక్రిడిటేషన్ అందిస్తారు.
* ఉపాధి పెంపొందిచడానికి ఉమ్మడిగా కలిసి పనిచేయడం.
* పరస్పర అవగాహన కార్యక్రమాలు నిర్వహణ
* హ్యాకథాన్ లీగ్‌పై ఉపాధిని పెంచడానికి జాయింట్ ఇండస్ట్రీ మీట్‌అప్‌ల ఏర్పాటు