calender_icon.png 16 October, 2024 | 7:29 PM

జిల్లా కలెక్టర్ ని మార్చండి..

16-10-2024 05:14:51 PM

మంత్రి సీతక్కను విన్నవించిన డివైఎఫ్ఐ నాయకులు 

కుమ్రంభీం అసిఫాబాద్, (విజయక్రాంతి): జిల్లాలో విద్య, వైద్య రంగాలలో అనేక సమస్యలపై పలు సందర్భాల్లో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ వాటిని  పరిష్కరించకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తూరిన్నారని వెంటనే జిల్లా కలెక్టర్ ను మార్చాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను డివైఎఫ్ఐ నాయకులు గొడిసెల కార్తీక్, దుర్గం దినకర్ కోరారు. జిల్లాలో విద్యావ్యవస్థ గాడి తప్పుతుందని అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కేజీబీవీ, మోడల్ కళాశాలలో ఖాళీ అయిన పోస్టుల భర్తీ చేయాలని, జూనియర్ కళాశాలకు మైదానం, ప్రహరీ గోడ నిర్మించాలని, మోడల్ డిగ్రీ కళాశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

పోస్ట్ మేట్రిక్ బాలికల, బాలుర హాస్టల్ కి సొంత భవనం లేక అద్దె భవనాల్లో ఉంటున్నారని స్థలం కేటాయించి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. డైట్ కళాశాల భవనం పూర్తయినప్పటికీ అడ్మిషన్లు నిర్వహించడం లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలకు సొంత భవనం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో సరిపడా వైద్యులు, మందులు లేకపోవడంతో రోగులను రిఫర్ చేస్తున్నారని వివరించారు. విద్యుత్ సౌకర్యం సరిగా లేకపోవడంతో డయాలసిస్ కేంద్రంలో రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కనీసం పర్యవేక్షణ  చేయకుండా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని వెంటనే కలెక్టర్ ను మార్చాలని కోరారు.