14 స్థానాల్లో ఈ నెల 13కు బదులుగా 20న పోలింగ్
న్యూఢిల్లీ, నవంబర్ 4: మతపరమైన పండుగలు ఉండడంతో దేశంలో 14 స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల తేదీలను కేంద్ర ఎలక్షన్ కమిషన్ మార్చింది. వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం ఈ స్థానాలకు ఈ నెల 13న ఉప ఎన్నికలు జరగాలి.
కేరళ, పంజాబ్ , యూపీ రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల జరిగే 14 స్థానాల్లో మతపరమైన కార్యక్రమాల కారణంగా పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉండడంతో అక్కడ ఉప ఎన్నికలు వాయిదా వేయాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆర్జేడీ సమ పలు పార్టీలు ఈసీని కోరాయి. దీంతో ఈనెల 13కు బదులుగా 20వ తేదీకి పోలింగ్‌ను వాయిదా వేసినట్లు ఈసీ ప్రకటించింది.
పంజాబ్లోని డేరా బాబానానక్, చబ్బేవాల్, గిద్దర్ బాహా, బర్నాల్, యూపీలోని ఖైర్, మీరాపూర్, కుందర్కి, ఘజియాబాద్, కర్హాల్, సిషామౌ, ఫూల్‌ఫూర్, కతేహరి, మజావాన్, కేరళలోని పాలక్కాడ్, ఉన్నాయి. అయితే 23న జరిగే ఓట్ల లెక్కింపులో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. మరోవైపు కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్‌లో ఈసీ ఎటువంటి మార్పు చేయలేదు.