హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాం తి): పదో తరగతి విద్యార్థుల ప్రీ ఫైనల్ పరీక్షల రివైజ్డ్ టైంటేబుల్‌ను పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. రంజాన్ నేపథ్యం లో పరీక్ష సమయాల్లో స్వల్ప మార్పు లు చేసినట్టు డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. మార్చి 3 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంట ల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. అంతకుముందు మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.