calender_icon.png 7 November, 2024 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌టీసీజీ పన్ను విధానంలో మార్పు

07-08-2024 01:24:28 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 6: గృహాల కొనుగోలు, అమ్మకంపై విధించే లాంగ్ ట ర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) పన్ను విధానంలో కేంద్రం సవరణ లు ప్రతిపాదించింది. స్థిరాస్తుల అమ్మకంతో వచ్చే ఆదాయంపై పన్ను వేసే సమయంలో ద్రవ్యోల్బణాన్ని కలపటాన్ని ఇండెక్సేషన్ బెనిఫిట్స్ అంటారు.

ఇటీవల బడ్జెట్‌లో ఇండెక్రేషన్ బెనిఫిట్స్‌తో కూడిన 20% ఎల్ టీసీజీ పన్ను స్థానంలో ఇండెక్సేషన్ లేకుండా 12.5 పన్ను విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. ఇది జూలై 23 నుంచే అమల్లోకి వచ్చింది. దీనివల్ల గతంకంటే అధిక భారం పడుతుందని ఆందోళనలు వ్యక్తంచేయటంతో తాజాగా పాత, కొత్త పన్ను విధానాల్లో దేన్నయినా ఎంచుకోవచ్చని కేంద్రం సూచించిం ది. దీని సవరణ బిల్లు కాపీలను ఎం పీలకు మంగళవారం అందించింది.