calender_icon.png 24 October, 2024 | 11:53 AM

ఆగస్టు 15 తర్వాత మార్పు!

09-08-2024 01:53:40 AM

వాణిజ్య పన్నుల శాఖలో సమూల మార్పులు 

ఉద్యోగుల అంతర్గత బదిలీలకు రంగం సిద్ధం

ఆరేళ్లుగా డిప్యూటేషన్‌పై ఓ అధికారి

5 రోజులుగా నూతన కమిషనర్ రిజ్వీ సమీక్ష

సీటీవో, ఎన్‌ఫోర్స్‌మెంట్ అక్రమాలపై ఆరా?

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): వాణిజ్య పన్నుల శాఖపై నూతన కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ సయిద్ అలీ ముర్తాజా రిజ్వీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆగస్టు 15 తర్వాత శాఖలో సమూల మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా గత ౪ రోజులుగా వరుసబెట్టి డిపార్ట్‌మెంట్ల వారీగా రివ్యూలు చేస్తున్నారు. ఉదయం 10గంటలకు ఆఫీసుకు వస్తే.. రాత్రి 9 గంటల వరకు సమీక్ష లతో ఊపిరాడానివ్వట్లేదని అధికారులు చెప్తున్నారు.

కమర్షియల్ ట్యాక్స్ శాఖపై కొంతకాలంగా ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? గత ఎనిమిది నెలల్లో ఏం జరిగింది? హెడ్డాఫీస్‌లో అదనపు బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారు? డిప్యూటే షన్‌పై వచ్చిన వాళ్లు ఎవరు? వాళ్లు ఎంత కాలంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు? అనే అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. ఈ క్రమంలో పలు విషయాలు రిజ్వీ దృష్టికి వచ్చినట్టు సమాచారం.

మాజీ కమిషనర్ శ్రీదేవి హయాంలో చాలామంది అధికారులకు కీలక డిపార్ట్‌మెంట్లలో అదనపు బాధ్యతలను అప్పగించినట్టు తెలిపింది. ఇదే సమయంలో ఓ అధికారి ఆరేళ్లుగా డిప్యూటేషన్‌పై హెడ్డాఫీస్‌లో పని చేస్తున్నట్టు తెలిసింది. ఇటీవల ఆ ఆధికారి గడువు ముగిసినా అనధికారికంగా ఇంకా కొనసాగుతు న్నారని.. ఈ క్రమంలో శాఖలో సమూల మార్పులు చేయాలనే అభిప్రాయానికి రిజ్వీ వచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే అధికారులకు అదనపు బాధ్యతలను తొలగించడంతోపాటు కొందరి అంతర్గత బదిలీలకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.  

అధికారులతో విడివిడిగా భేటీ 

నూతన కమిషనర్ రిజ్వీ డిపార్ట్‌మెంట్‌లోని లోపాలపై తనదైన శైలిలో ఆరా తీస్తు న్నారు. ౪ రోజుల్లో కీలక అధికారులతో పలుమార్లు ఉమ్మడిగా సమీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఒక్కో అధికారితో విడివిడిగా మాట్లాడినట్టు తెలిసింది. అధికారులు ప్రస్తు తం నిర్వహిస్తున్న విధులు ఏంటి? వారి లోపాలు ఏంటి? అనే విషయాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువా రం డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ స్థాయి అధి కారులతో రిజ్వీ గంట చొప్పున మాట్లాడినట్టు తెలిసింది. అధికారుల పనితీరు గురిం చి సిబ్బంది, ఉద్యోగులను కూడా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

25 తర్వాత ఎక్కడ ఉంటానో?

కమర్షియల్ టాక్స్‌లో ఓ ముఖ్య అధికారిని గురువారం సంప్రదించగా కీలక వ్యాఖ్య లు చేశారు. ఈ నెల 15 తర్వాత తాను వాణిజ్య శాఖలో ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉంటా నో తెలియదని, 25 నాటికి తాను ఏ విభాగంలో ఉండేది తెలుస్తుందనడం గమనార్హం. ఆ అధికారి చెప్పిన ఈ మాటలను వింటే.. శాఖలో 15 తర్వాత ఏదో జరుగుతుందన్న విషయం అర్థమవుతోంది. అంతర్గత బదిలీల వార్తలకు ఆ అధికారి మాటలు మరింత బలాన్ని చేకూర్చాయి.

ఒక్క ఖమ్మం జిల్లాలోనే సీటీవో?

గత కొంతకాలంగా వాణిజ్య పన్నుల శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్, సీటీవో అధికారులపై పలు ఆరోపణ లు ఉన్నాయి. కొందరు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వ్యాపారస్థులకు నోటీసు పంపి, ఆ తర్వాత సెటిల్‌మెం ట్ చేసుకున్నారనే విమర్శలు ఉన్నా యి. కొందరు సీటీవోలు కూడా పలు అక్రమాలకు పాల్పడినట్టు తెలిసింది. హైదరాబాద్‌లోనే ఆమ్దానీ ఎక్కువ ఉంటుందన్న ఆశతో సీటీవోలు జిల్లాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఖమ్మం జిల్లా మిన హా ఏ జిల్లా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో కూడా సీటీవోలు లేరనే ఆరోప ణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్రమాలు, అవినీతి పాటు, నిబంధనల కు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న అధికారులపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం.