calender_icon.png 10 February, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రికా టాండన్.. చెన్నై చంద్రమే!

04-02-2025 12:00:00 AM

ప్రపంచ సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానో త్సవం లాస్ ఏంజెల్స్ వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడకకు ప్రఖ్యాత గాయకులు, సంగీత దర్శకులంతా హాజరయ్యారు. అమెరికా సింగర్, వ్యాపారవేత్త అయిన 71 ఏళ్ల చంద్రికా టాండన్ అవార్డు అందుకున్నారు. పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయి సోదరే చంద్రికా టాండన్. చంద్రిక రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్.. ‘బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాం ట్’ ఆల్బమ్‌గా అవార్డు సొంతం చేసుకుం ది.

చంద్రికా టాండన్.. చెన్నై చంద్రం కావ టం విశేషం! భారతీయ సంతతికి చెందిన చంద్రిక టాండన్ మూలాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. చంద్రిక చెన్నైలోని సంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి కూడా సం గీత విధ్వాంసురాలు కావడంతో ఆమెకు స్వతహాగానే సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. చెన్నైకు చెందిన వీరి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. హిందుస్థా నీ గాత్రం, కర్ణాటక గాత్రంతోపాటు పాశ్చాత్య సంప్రదాయ సంగీతంలోనూ టాండన్ శిక్ష ణ పొందారు.

మెకిన్సే అండ్ కంపెనీలో భాగస్వామిగా ఎన్నికైన మొదటి భారతీయ మహి ళ కూడా టాండనే. ప్రపంచ స్థాయి వేదికలపై సం గీత కచేరీలెన్నో నిర్వహిం చిన చంద్రిక తన మొదటి ఆల్బమ్‌గా ‘సోల్ కాల్’ను 2006లో విడుదల చేశారు.  1930లో మహా త్మా గాంధీ ‘స్టాల్ మార్చ్’ ప్రేరణతో రెండో ఆల్బమ్‌ను,  ‘శివోహం ది క్వెస్ట్’, ‘అమ్మూస్ ట్రెజర్స్’ పేరుతో విడుదల చేశారు.  

అమ్మ పెళ్లిపీటలకెక్కమంటే.. తాత పైచదువులకు పంపారట! 

చంద్రికా కృష్ణమూర్తి టాండన్.. కుటుంబంలో మొదటి కుమార్తెగా జన్మించినం దున పద్దెనిమిదేళ్ల వయసులోనే వివాహం చేయాలనుకున్నారు. అయితే చంద్రిక తాత పట్టుబట్టి మరీ ఆమెను పైచదువులకు పంపించారు. ఉన్నత విద్యనభ్యసించేందు కు తన తల్లి నిరాకరించటంతో చంద్రిక రెండు రోజుల పాటు అన్నపానీయాలు మానేశారు.

దీంతో చేసేదిలేక కుటుంబ సభ్యులు ఆమెను మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చేర్పించారు. చెన్నైలో న్యాయమూ ర్తిగా ఉన్న తన తాత మాదిరిగానే తాను న్యాయవృత్తిలో స్థిరపడాలనుకున్నారు. కానీ ఓ ప్రొఫెసర్ సలహాతో ఐఐ ఎం అహ్మదాబాద్ నుంచి పట్టా  పొందారు.