calender_icon.png 17 April, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేతకి సంగమేశ్వర ఆలయ చైర్మన్‌గా చంద్రశేఖర్ పాటిల్

08-04-2025 12:00:00 AM

హాజరైన జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్

జహీరాబాద్, ఏప్రిల్ 7:దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయ చైర్మన్గా విధులపల్లి గ్రామానికి చెందిన శేఖర్ పాటిల్ ను  నియమించారు. దేవాదాయ   శాఖ కమిషనర్ ఆదేశాలతో 11 మంది సభ్యులు సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్,  జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ మంత్రి  చంద్రశేఖర్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, మాజీ జడ్పీ చైర్మన్ సునీత హనుమంతరావు పాటిల్ హాజరయ్యారు.

ముందుగా దేవాలయ ప్రాంగణంలో 11 మంది సభ్యులతో ప్రమాణం చేయించి 11 మందిలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకోవడంతో అప్పన్న గారి చంద్రశేఖర్ పాటిల్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. అనంతరం లింగాయత్ సత్రంలో కాంగ్రెస్ పార్టీ సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  ఎంపీ సురేష్ షెట్కార్  మాట్లాడుతూ దేవాలయ అ భివృద్ధి కొరకు ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. శేఖర్ పాటిల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినందున తగిన గౌరవం లభించిందని  తెలి పారు.

రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఈ ఆలయానికి తీసుకొచ్చే ప్రయ త్నం చేస్తామని ఎంపీ తెలిపారు. దేవాలయ ధర్మకర్త మండలి సభ్యులుగా గడ్డం మల్లికార్జున్, పట్లోళ్ల నమాజ్ రెడ్డి, బసయ్య స్వామి, సుంచు లక్ష్మి, మహంకాల్ తిరుమలేష్, మలిశెట్టి పాటిల్, ఎక్కిల్లి శ్రీనివాస్, కొబ్బా శివకుమార్ పటేల్, విట్టల్ రెడ్డి, పోలీసు మల్లన్న, జీ లక్ష్మన్నలను  నియమించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు లతో పాటు జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్కల్, రాయికోడు, కోహిర్, మొగుడంపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.