calender_icon.png 10 January, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తకొండ ఆలయ చైర్మన్‌గా చంద్రశేఖర్

10-01-2025 12:49:55 AM

భీమదేవరపల్లి, జనవరి 9: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్త కొండ వీరభద్రుడి ఆలయ చైర్మన్‌గా కొమురవెళ్లి చంద్రశేఖర్‌గుప్తా నియామకం అయ్యా రు. కొత్తకొండలో బుధవారం జరిగిన సమావేశంలో ఆలయ ఈవో పీ కిషన్‌రావు ఉత్తర్వులు అందజేశారు.

ఆలయ డైరెక్టర్లుగా కొంగొండ సమ్మయ్య, కురుమల్ల మంజుల, గనబోయిన కొంర  బత్తిని శ్రీనివాస్, గుగులోత్ రాజునాయక్, పెండ్యాల తిరుపతి, పోలు సంపత్, తల్లం విక్రమ్, బానోత్ కిషన్‌నాయక్, బోయినపల్లి ఉమాపతిరావు, దామెరుప్పుల కోటేశ్వర్, కందూరు దేవేందర్‌రెడ్డి, అనుకోటి నాగరాజు, కంచనపల్లి రాజయ్య నియామకం అయ్యారు.

ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వీరభద్రుని బ్రహ్మోత్సవాలకు 15 లక్షల మంది భక్తులు వస్తారని, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అశోక్‌ముఖర్జీ, కేతిరి లక్ష్మారెడ్డి, పిడిశెట్టి కనుకయ్య, ఊసకోయిల ప్రకాశ్, కొలుగూరి రాజు, ఆదరి రవిందర్, కంకల సమ్మయ్య, చిట్టంపల్లి అయిలయ్య, గుడికందుల రాజు, బొక్కల స్రవంతి పాల్గొన్నారు.