calender_icon.png 10 January, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజన్ 2047తో ముందుకెళ్తున్నాం: ఏపీ సీఎం

03-01-2025 07:19:38 PM

హైదరాబాద్: విజన్ 2047తో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) అన్నారు. 2047 నాటికి మనం ప్రపంచంలోనే మొదటి, రెండో స్థానంలో ఉంటామన్నారు. నగరంలోని హెచ్ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య మహసభలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ నలుమూలల నుంచి తెలుగువారు ఇక్కడకు వస్తున్నారు. వివిధ దేశాల తెలుగు సమాఖ్యల అధ్యుక్షులు మహాసభలకు హాజరయ్యారని తెలిపారు. ఇది నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు అని చెప్పారు. అలాగే ఈ మహసభల ఉత్సవాలు ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుకుంటున్నామన్నారు. ఎన్టీఆర్ (NTR) చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైయిందని చంద్రబాబు గుర్తుచేశారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు తెలుగువారు ఎక్కడున్నా ఒకటేనని చెప్పారు. బ్రెయిన్ డ్రెయిన్.. బ్రెయిన్ గెయిన్ అవుతుందని ఆనాడే చెప్పా, ఆరోజు నేను చెప్పింది ఇవాళ నిజమైందని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రాంతం గొప్ప ఐటీ సిటీగా మారుతుందని ఆనాడే ఊహించానని చెప్పారు. విజన్ 2020 తయారుచేసుకుని ఆనాడు ముందుకెళ్లాం.. తెలుగు ఏంజిల్స్ అనే పేరుతో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచంలోనే మేటి నగరంగా హైదరాబాద్ మారిందంటే దూరదృష్టే కారణమన్నారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వం వేసిన పునాది వల్లే ఇక్కడ ఆదాయం పెరిగిందని చెప్పిన సీఎం చంద్రబాబు దేశ విదేశాల్లో తెలుగువాళ్లు గొప్పగా రాణిస్తున్నారని ప్రశంసించారు.  దేశానికి దశ, దిశ చూపించిన వ్యక్తి పీవీ నరసింహారాని(P. V. Narasimha Rao) ఆయన సూచించారు. ఆనాడు ఐటీ అంటే అనేకమంది ఎగతాళి చేశారన్న తెలిపిన ఏపీ సీఎం విదేశాల్లో అనేకమంది తెలుగువారు పారిశ్రామికవేత్తలుగా మారారని చెప్పారు. అమెరికాలో మన తెలుగువాళ్లే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారని వెల్లడించారు. మీరు ఏ దేశానికి వెళ్లినా అద్భుతంగా రాణించిన తెలుగువాళ్లు కనిపిస్తారని తెలిపారు. ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన వారిలో 55 శాతం తెలుగువాళ్లేనన్నారు.

ఎక్కడికి వెళ్లిన మాతృభూమిని మరిచిపోకూడదని అనేకసార్లు చెప్పానని చంద్రబాబు పేర్కొన్నారు. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువాళ్లు మరింత ఉన్నతస్థితికి ఎదగాలని చెప్పారు. ఏఐ, డీప్ టెక్నాలజీని తెలుగువాళ్లు అందిపుచ్చుకోవాలన్నారు. ప్రతి ఇంట్లో ఒక ఆంత్రప్రెన్యూర్(Entrepreneur) ఉండాలని ఆకాంక్షించిన సీబీఎన్ పెట్టుబడుల కంటే ఐడియాలు చాలా ముఖ్యమని తెలిపారు.  దుబాయ్ ప్రభుత్వ సాయంతో ఆనాడు ఈ కన్వెన్షన్ నిర్మించామని గుర్తుచేశారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అనేక భవనాలు నిర్మించామని వెల్లడించారు. అనేక దేశాలు తిరిగి ఐటీ కంపెనీలు ఇక్కడకు వచ్చేలా చేశానన్న ఆయన తెలుగువాళ్లు ఎక్కడున్నా పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగువాళ్లు(Telugu people) ఐక్యంగా ఉండి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. తెలుగువారు గౌరవం తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు.  తెలుగుభాష వికాసానికి రామోజీరావు ఎంతో కృషి చేశారు. తెలుగుభాషకు గిడుగు రామ్మూర్తి ఎంతో సేవ చేశారు. ఇప్పుడే చేయాల్సింది హర్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్(Smart work).. అని టెక్నాలజీని సరిగా వినిమోగించుకుంటే మీరు ప్రపంచాన్ని శాసించవచ్చన్నారు. చిన్న ఆలోచనతో ర్యాపిడో స్థాపించి గొప్పగా రాణించారు. కో వర్కింగ్ స్పేస్ ద్వారా వేలమందికి ఉపాధి కల్పిస్తున్నారు. వినూత్నంగా ఆలోచిస్తే తెలుగువాళ్లు మరింత రాణిస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.